వెన్ను నొప్పి పై రోగికి అవగాహన
నేపథ్య సమాచారం
- అమెరికా జనాభా లొ 80% వరకు వారి జీవితంలొ నడుము నొప్పి అనుభవిస్తున్నారు.
- వెన్ను నొప్పి లక్షణాలు ఒక్కోసారి భారీ పనులు చేసేట్టపుడు అకస్మాత్తుగా లేదా సాపేక్షంగా సున్నితమయిన కదలికల వల్ల కూడా రావచ్చు.
- తరచూ నొప్పి, కదలకుండా ఒకే భంగిమ లో ఉండడము వలన కానీ లేదా ఒకే రకమయిన చర్యను పునరావృతంగా సుదీర్ఘ కాలంలో చెయ్యడము వలన రావచ్చు.
- చాలా మందికి రెండు వారాల వ్యవధిలొ డాక్టర్ సందర్షన, డాక్టర్ సిఫార్సు చెసే ఇంఫ్లమేటరీ మందులు లేదా థెరపీ చికిత్స అవసరము లేకుండా నే నొప్పి తగ్గుతుంది.
- చాలా అరుదుగా వెన్నుముక క్రింది భాగం లొ నొప్పి,గాయానికి శస్త్ర చికిత్స అవసరం.
వెన్ను నొప్పి లక్షణాలు:
- వెన్ను నొప్పి వెన్ను పూస మధ్య భాగము లో కానీ, ఒక ప్రక్కన కానీ, లేదా వెన్ను క్రిందర భాగము మొత్తము లో కనిపించవచ్చు.
- పిరుదులు, తొడ, దిగువ కాలు, లేదా పాదములో కూడా లక్షణాలు కనిపిస్తాయి.దీనినే సయాటికా అంటారు.
- కాలు లోని లక్షణాలు, నొప్పి, జలదరింపు, తిమ్మిరి, బలహీనత యొక్క భావన లేదా అన్ని లక్షల కలయిక కూడా కావచ్చు.
- సాధారణంగా కాలు లో ఎంత క్రిందకయితే లక్షణాలు వ్యాపిస్తాయో, నడుము నొప్పి జబ్బు యొక్క తీవ్రత అంత ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటాము.
చిట్కాలు:
వెన్ను నొప్పి తో బాధపడేవారు కుర్చునేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
సుధీర్గంగా వంగి కూర్చోవడము వలన నొప్పి కలుగుతూ, అదే నొప్పి వీపు నిటారుగా సవరించడము వలన తగ్గిస్తున్నట్లయితే, ఉపయోగపడే ఒకే ఒక చికిత్స భంగిమ సవరణ మాత్రమే.
- కూర్చొనప్పుడు వెన్నుముకకు మద్దత్తు ఇచ్చే ద్రుడమైన కుర్చీలను ఎంచుకోండి.మృదువయినా ఉపరితలం పైన కూర్చోవడము వలన, నడుము వంపుకు గురిఅవుతుంది.
- లంబార్ సపోర్ట్ దిండును కానీ, ఒక చిన్న రోల్ ను కానీ నడుము వెనుక భాగము పైన ఉంచడము వలన, వీపును నిఠారు భంగిమలో ఉంచి కూర్చోగలుగుతారు.
- సుధీర్ఘంగా కూర్చొవాలసి వస్తున్నపుడు, ప్రతి 30 నిమిషాలకు లేచి నుంచోవడము, లేదా నడవడము చెయ్యండి.
వెన్ను నొప్పి రాకుండా ఉండడానికి, బరువులు ఎత్తేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు
పదే పదే వంగడం లేదా ఎత్తడం వంటి చర్యలు వెన్ను నొప్పికి కారణం అవ్వవచ్చు.
- వీలయినంత వరకు,పిరుదులు , మోకాళ్ళతో వంగి,నడుమును తిన్నగా ఉంచుతూ, బరువులు ఎత్తండి.
- బరువు ఎత్తడము సునాయాసపరుచోకోడానికి, బరువును నడుము దగ్గరకు లాగండి.
- బరువు తరలిస్తున్నపుడు, మీ పాదాలతో కదలండి, నడుముని మెలితిప్పకండి.
- ఏదైన భారీ కార్యాచరణను మితంగా పూర్తి చెయ్యండి. ఫర్నిచరు తరలించడం, తోట పని చెయ్యడం వంటి వాటి నుంచి తరచుగా విరామం తీసుకుంటూ దశల వారీగా పూర్తి చెయ్యండి.
వెన్ను నొప్పి ఉన్నవాళ్లు సుఖంగా పడుకునేందుకు చిట్కాలు
నిద్రపోవడము లేదా నడుము వాల్చి పాడుకోవడము వలన, వెన్నుపైన భారమును తగ్గించవచ్చు , కానీ పడుకునేటప్పుడు సౌకర్యవంతమయిన భంగిమ కూడా అవసరము.
- మీ వెన్నెముకకు ఉత్తమముగా మద్దత్తు ఇచ్చే పరుపును ఎంచుకొండి.దుకాణములో పరుపు పైన ఇంట్లో పడుకునే విధముగా పడుకొని ప్రయత్నించండి. చాల మంది దృఢమయిన పరుపుకి కానీ మరీ గట్టిగ లేని పరుపుకు బాగా స్పందిస్తారు.
- ఒక వైపు పడుకున్నప్పుడు, మీ మోకళ్ల మధ్య ఒక దిండు లేదా మెత్త ఉంచండి.
- నడుస్తున్నపుడు వేగాన్ని నెమ్మదిగా మార్చండి. మంచము పైన పడుకొని లేచి కూర్చోవాలనుకున్నపుడు, వెల్లకిలా పడుకొని ఉంటె,ముందుగా పక్కకి తిరిగి పడుకొని, తరవాత రెండు కాల్‌లను మంచము బయటకు వాల్చి,నిదానంగా రెండు చేతుల ఆసరాతో పైకి లేచి కూర్చోండి.
వెన్ను నొప్పికి వైద్యుల సలహా ఎప్పుడు తీసుకోవాలి
- నడుము నొప్పి లక్షణాలు తీవ్రమవుతుంటే, లేదా లక్షణాలు కాలు క్రిందభాగములోకి వ్యాపిస్తుంటే, లేదా రెండు వారాలలో నొప్పి తగ్గక పోతే వైద్య నిపుణల సలహాను ఆశ్రయించండి.
- ఫీజియోథెరపీ సాధారణంగా వెన్ను నొప్పి నివారించే మొదటి చికిత్స కోర్స్ గ సిఫారసు చేస్తారు. చాల వరకు ఫీజియోథెరపీ వలన నొప్పి విజయవంతంగా నిర్మూలించగలుగుతారు.
రచయిత పరిచయము:
Dr. క్రిస్టోఫర్ హెయిన్ట్జల్మాన్ , DPT,OCS , CMDT.
థెరెక్స్ పోర్టల్ క్లినికల్ సలహాదారు
శ్రీ క్రిస్ హీంట్జెల్మాన్ పిటి, డిపిటి, ఓసిఎస్, ఎండిటి. 2003 లో ఆర్కాడియా విశ్వవిద్యాలయం నుండి భౌతిక చికిత్సలో డాక్టరేట్ పొందారు. క్లినిక్‌లో తన 12 సంవత్సరాలలో, ఆర్థోపెడిక్స్‌లో, ముఖ్యంగా వెన్నెముకలో ఎక్కువ అనుభవం సంపాదించారు. . 2010 లో, మెకానికల్ డయాగ్నోసిస్ అండ్ థెరపీ యొక్క మెకెంజీ పద్ధతిలో ఆయన సర్టిఫికేట్ పొందారు. క్రిస్ క్లినికల్ బోధకుడు, మరియు అతను ఆర్కాడియా విశ్వవిద్యాలయం మరియు వైడెనర్ విశ్వవిద్యాలయానికి ప్రయోగశాల బోధకుడిగా అనుభవం కలిగి ఉన్నారు. . ప్రస్తుతం, అతను బ్రైన్ మావర్ పునరావాస ఆసుపత్రిలో సమగ్ర కంకషన్ కార్యక్రమంలో భాగంగా ఉన్నారు, మరియు అతను ఇతర స్టాఫ్ థెరపిస్టుల కోసం ఆర్థోపెడిక్స్ మెడ వెన్నెముక మార్గదర్శక కార్యక్రమానికి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.