సూపర్ బ్రెయిన్ యోగా-తోప్పుకరణం. సాంప్రదాయము -నేటి పరిశోధన.
సూపర్ బ్రెయిన్ యోగా-అనే ఆచరణ లో మీ చెవి లోబ్ వద్ద ఆక్యుప్రెషర్ పాయింట్‌ను , బొటనవేలు మరియు ఇతర వేళ్లతో ఒత్తి పట్టుకొని, గుంజీలు తీస్తారు.
ఆధ్యాత్మిక ప్రాముఖ్యత:
ఈ బ్లాగ్ వ్యాసము ద్వారా,పవిత్రమయిన వినాయక చవితి పర్వదినాన, పురాతన కాలంనుంచి,పూజ చివరిలో గుంజీలు తీసే ప్రక్రియ ఏదయితే ఉన్నదో, దాని గురించి విశ్లేషించుకుందాము.
ఈ పర్వదినాన,, నేను బ్రాహ్మణుడు పూజా విధానము ఠించడం ల్యాప్‌టాప్‌లో ప వింటున్నప్పుడు, పూజారి ఇంటిల్లిపాది,పూజా చివరలో చెవిని పట్టుకొని 10 గుంజీలు తీయమని సలహా ఇచ్చారు.
ఈ రోజు పూజలో బ్రాహ్మణుడు laptop లొ శ్లోకాలు పఠిస్తుండాగా కుటుంబ సమేతంగా పూజ చివరిలొ చెవులు పట్టుకుని 10 గుంజీళ్ళు తియ్యమని పూజారి గారు చెప్పారు.
వ్యక్తిగత అనుభవము:
నేను మా 9 సంవత్సరాల బాబు ని గుంజీలు తియ్యమని అడగగా, వాడు చక్కగా, మొత్తము గుంజీలు, పిరుదులు మడములకి అనుకునేలాగా గుంజీలు తీసాడు, నేను మా శ్రీవారు మాత్రమూ, క్రొద్దిగా మర్చి, మోకాళ్ళు 90 డిగ్రీలకు మాత్రమే వంచి గుంజీలు తీశాము.
తరవాత నేను తెలుస్కున్నది ఏమిటంటే, దీనినే “తొప్పుకరణము “అని పిలుస్తారు అంట.
ఆలా న చిన్ననాటి రోజులను కూడా ప్రియంగా ఒకసారి నెమరువేకున్నాను, నేను మా అన్న చిన్నపుడు ప్రతి వినాయక చవితి కి పోటీలు పడే వాళ్ళము ఎవరు ఎక్కువ గుంజీలు తీస్తారో అని, అప్పుడు మేము కూడా పూర్తి గుంజీలు తీసేవాళ్ళము లేండి : ) ఇంకొక సంఘటనలో, మా సోషల్ స్టడీస్ మాస్టారు, క్లాసు మధ్యలో మాట్లాడుతున్నానని బయట నుంచొని గుంజీలు తియ్యమన్నారు. (నేను ఎప్పుడు ఆ సబ్జెక్టు లో వీక్ లెండి).
ఇపుడు నేను ఫిసికల్ థెరపిస్ట్ గా పనిచేస్తున్నాను, ఈ మధ్యలో ఇంటర్నెట్ లో బ్రెయిన్ పవర్ యోగ గురించి, అది చెయ్యడము వలన పిల్లల దృష్టి ఎలా మెరుగుపడుతుందో అని ఒక పోస్ట్ చూసాను,అప్పుడు అబ్భా! నిజమే కదా అనిపించింది.
సూపర్ బ్రెయిన్ యోగా/తొప్పుకరణము వెనుక పరిశోధన
నాకు ఒక 3 రోజులు సెలవు దొరకడము వలన, ఒకసారి ఇదేంటో చూద్దాము అని,అన్ని జర్నల్స్ వెతకడము, చదవడము మొదలు పెట్టాను.
నా పరిశోధనలో యేల్ విశ్వవిద్యాయములోని ఒక డాక్టర్ గారి పరిశోధన గురుంచి చాలా రీసెర్చ్ పేపర్స్ లో ప్రస్తావించారు, అలాగే నేను మా శ్రీవారు గుంజీలు మార్చి చేసిన తొప్పుకరణము గురించి కూడా పరిశోదనులు చెయ్యబడ్డాయి.
అమెరికా లో ఉండే ప్రాణిక్ హీలింగ్ సెంటర్ వారు విస్తృతంగా ఈ బ్రెయిన్ పవర్ యోగ గురించి పరిశోధన చేసారు. వారు గేట్స్ మాక్జినిటీ రీడింగ్ ఇన్వెంటరీని కొలత సాధనంగా ఉపయోగించి, బ్రెయిన్ పవర్ యోగ చేసే స్కూల్ కి వెళ్లే పిల్లలకు, ప్రామాణిక పరీక్ష స్కోర్లు. అధ్యయనం సానుకూల దిశలో 24 పాయింట్ల మార్పును చేకూరుస్తుందని తెలిపారు.
అలాగే ఇంకొక పరిశోధనలో 4 చిన్నారులు, ఆటిజం మరియు A.D.D డిసార్డర్ లాంటి లక్షణాలతో బాధపడుతున్న చిన్నారులతో క్రమము తప్పకుండా బ్రెయిన్ పవర్ యోగా ఆచరించడము వలన, వారిలో ఇంద్రియ ప్రాసెసింగ్, విజువల్ పర్సెప్షన్, విజువల్-మోటారు వేగం, ప్రసంగం, భాష, కమ్యూనికేషన్ మరియు సామాజిక ప్రవర్తనలో గణనీయమైన మెరుగుదలలు నివేదించబడ్డాయి.
ఎస్-వ్యాసా విశ్వవిద్యాలయంలో చంద్రశేఖరన్ మరియు ఇతరులు నిర్వహించిన ఒక అధ్యయనం, యువకుల లో శ్రద్ధ మరియు మానసిక స్థితులపై తోప్పుకరణం యొక్క ప్రభావాన్ని అంచనా వేసింది, బేస్‌లైన్, మరియు సాంప్రదాయ గుంజీలు తో పోలిస్తే తొప్పుకరణము చేసే యువకులలో శ్రద్ధ మరియు నిరోధక నియంత్రణలో గణాంకపరంగా గణనీయమైన మెరుగుదల నివేదించింది.
యేల్ విశ్వవిద్యాలయంలో జూనియర్ డాక్టర్ యుజెనియస్ ఆంగ్ చేసిన అసలు పరిశోధన అధ్యయనాన్ని నేను కనుగొనలేకపోయాను, దీనిని చాలా మంది పరిశోధకులు పేర్కొన్నారు.
విమర్శ:
బ్రెయిన్ యోగా యొక్క మొత్తం అభ్యాసం ఒక బూటకమని ఒక వైరుధ్య అభిప్రాయము కూడా చాలా మంది లో ఉంది.
భూటకమో నిజమో, ఏరోబిక్ కార్యకలాపాల యొక్క ప్రయోజనకరమైన ప్రభావాలకు, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సమన్వయం, శ్రద్ధ మరియు మానసిక నైపుణ్యాలను సమర్థించే పరిశోధనలు చాలానే ఉన్నాయి.
సిఫార్సు చేసిన ప్రాక్టీస్:
ఈ వ్యాయమ ప్రక్రియ యొక్క ప్రయోజకరమయిన ప్రభావాలు కనిపించడానికి, సిఫారసు చేయబడిన మోతాదు సూపర్ బ్రెయిన్ యోగా లేదా తోప్పుకరణం లో కానీ ప్రతి రోజు 15-20 మార్లు.
ప్రత్యేక యోగా సలహాదారు-
వీడియో వివరణ
థెరెక్స్ పోర్టల్ యొక్క క్లినికల్ సలహాదారు శ్రీ అమరావతి ఎరబల్లి చేసిన ఒక చిన్న ప్రదర్శ వివరణను, పైన వీడియో లో చూడొచ్చు. ఆమె సర్టిఫైడ్ యోగా టీచర్ మరియు భారత దేశములోని, రిషికేశ్ యోగా సంస్థాన్ కు సహ వ్యవస్థాపకురాలు కూడా.
రచయిత:
ఆషా గుమ్మడి, అమెరికా లో పనిచేస్తున్న ఒక ఫీజికల్ థెరపిస్ట్. ఆమె 15 సంవత్సరముల అనుభువము ఉన్నది. ఆమె అమెరికా లో APTA బోర్డు సర్టిఫైడ్ న్యూరలా జికల్ క్లినికల్ స్పెషలిస్ట్. ఆమె వెస్టిబ్యూలార్ రీహాబిలిటేషన్ లో సమర్థురాలు. ఆమె ప్రాక్టీస్ లో ప్రధమముగా, పక్షవాతము, ఆస్తులితము,బ్యాలెన్స్ మరియు వెస్టిబ్యులర్ పాథాలజీల నుండి క్రియాత్మక లోపాలతో బాధపడుతున్న రోగులకు ఫీజియోథెరపీ ద్వారా చికిత్స చేస్తారు.
References:
- http://www.pranichealingontario.ca/SUPERBRAIN.pdf
- https://www.energie-institut.com/wp-content/uploads/2015/05/2006-Koterba-Superbrain-Yoga-USA.pdf
- Chandrasekeran, A., Rajesh, S. K., & Srinivasan, T. (2014). Effect of repetitive yogic squats with specific hand position (Thoppukaranam) on selective attention and psychological states. International journal of yoga, 7(1), 76–79. doi:10.4103/0973-6131.123497
- Verma, S. & Kumar, K. (2016). Evidence based study on super brain yoga and its application on alpha E.E.G. in adolescence. International Journal of Science and Consciousness; 2(4): 40-46.